తన ఇంట్లో 50,000 తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్న ఏసీబీ
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ డిఈఓ పై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విధితమే. ఈ విషయంపై సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఉన్నత అధికారుల సైతం ఈ విషయంపై ఎలాంటి జోక్యం చేసుకోలేదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఓ ఉపాధ్యాయుని దగ్గర రూ. 50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ డిఇఓ పరిధిలో ఒక ఉపాధ్యాయుడు సినీ యాక్టర్ జాబితాకు సంబంధించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు డీఈఓను గతంలో కలిసినట్లు సమాచారం.
కాగా డీఈఓ నుంచి 50,000 బేరం కుదరడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఉపాధ్యాయుడు ఏసిబి కృష్ణ గౌడ్ ను ప్రత్యేకంగా కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం పక్క ప్రణాళికలతో డిఇఓ ను గురువారం ఉదయం రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ కృష్ణ గౌడ్ బృందం నేరుగా డీఈఓ ను పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో డీఈఓ ను విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించే విద్యాసంస్థల జిల్లా అధికారి ఏసీబీకి చిక్కడంతో జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారితీసింది.