16-12-2024 10:44:06 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనుల భూములను డెక్కన్ సిమెంట్ కంపెనీకి అమ్ముకున్న భూస్వాములు, ఇట్టి విషయాన్ని దళిత గిరిజనుల రైతులు తాము గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూములను దాదాపు 150 ఎకరాలు భూస్వాములు డెక్కన్ సిమెంట్ కంపెనీకి అమ్ముకున్నారని మాకు న్యాయం చేయాలని, కాటారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబును కలిసి రైతులు విన్నవించారు. వెంటనే స్పందించిన రాజబాబు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను అక్రమ భూముల అమ్మకాలపై సమగ్ర విచారణ జరిపి తమకు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఇట్టి అక్రమ భూముల అమ్మకాలపై విచారణ కమిటీని నియమించి నేటి నుండి విచారణ చేపట్టనున్నట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.