calender_icon.png 4 February, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

04-02-2025 07:57:21 PM

మోవ లడ్డు తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రాజర్షి షా..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నార్నూర్ మండలంలోని సామాజిక అరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ యూనిట్ ను తనిఖీ చేసి రక్త నిల్వ పరికరాలను పరిశీలించి, సిబ్బందిని త్వరగా నియమించి కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. అనంతరం ప్రసూతి వార్డు, స్కానింగ్, టాయిలెట్స్ లను పరిశీలించి నార్మల్ డెలివరీలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకొని రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలను చూసారు. అదేవిధంగా ఖైర్దాట్వా గ్రామంలో ఏర్పాటు చేసిన గిరిజన మోవ లడ్డు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మోవ లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ ఆన్నారు. పోషక విలువలు గల ఈ లడ్డూలను చిన్నచిన్న కిరాణా షాపులు, స్వీట్ షాప్ లో సంబంధిత అధికారుల సమన్వయంతో అన్ని దుకాణాల సముదాయాలకు సరాఫర చేసి, మంచి ఆదాయం పొందాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.