కోరుట్ల, డిసెంబర్ 31 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో పలు వార్డులో ఇళ్లులేని నిరు పేదలు సమ ర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు. ఇంది రమ్మ పథకం కింద పూర్తిస్థాయి అరత గల నిరుపేద కుటుంబంలకు గుర్తించి మంజూ రు చేస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులు యొక్క వివరాలను యాప్ ద్వారా పొందు పరుస్తున్న వివరాల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించి,వివరాలను నమోదు చేపించి త్వరితగతిన సర్వేని పూర్తి చేయాలని ఆదేశించారు.