హుజూర్ నగర్: శనివారం సాయంత్రం హుజూర్నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో రేపు సాయంత్రం 5:00 గంటలకు జరుగు ఉత్సవాల ఏర్పాట్లు ఆర్డీవో తో కలిసి పరిశీలించారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇట్టి విజయోత్సవాలకు హాజరవుతున్నారు.
అధికారులు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు వారు చేసిన అభివృద్ధి సంక్షేమల ఫ్లెక్సీలను ఫంక్షన్ హాల్ వద్ద ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ జరిగే కళా ప్రదర్శనలు చూడటానికి ప్రజలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు.