06-04-2025 12:29:51 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏఫ్రిల్ 5: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైన విషయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో, మున్సిపాలిటీలలో పలు రేషన్ షాప్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేది ప్రజా ప్రభుత్వం ఉద్దేశమని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్ర మంలో ఇబ్రహీం పట్నం ఆర్డీవో అనంతరెడ్డి, డీఎస్‌వో శ్రీనివాసరావు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్‌రెడ్డి, కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర మహేందర్‌గౌడ్, మాజీ సింగల్ విండో చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.