calender_icon.png 3 April, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం

03-04-2025 12:09:59 AM

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి

త్రిపురారం, మార్చి 2 :  పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. త్రిపురారం మండలం నీలాయిగూడెం పంచాయతీ ఆవాసం ఘంటారావు క్యాంపులో రేషన్కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.

పేదలపై ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.పేదల కుటుంబాలు కడుపునిండా తినాలనే ఉద్దేశంతోనే సన్నబియ్యం పథకం ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే  మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.

ఐదు ఎకరాల్లోపు రైతులకు త్వరలోనే రైతుభరోసా సాయం ఖాతాల్లో జమ అవుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ కూన్రెడ్డి విజయకుమారి , కాంగ్రెస్ పార్టీ  మండల నాయకులు, అనుముల శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, అనుముల వెంకట్రెడ్డి, బిట్టు రవి, వేణు, అల్లంపల్లి జానయ్య, వీరయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.