calender_icon.png 22 April, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబలి పంపిణీ అభినందనీయం

22-04-2025 12:29:16 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్21( విజయ క్రాంతి):ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకుడు దేవార వినోద్ స్వా మి  ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ రామ్మోహన్ ఎస్.ఐ చంద్ర శేఖర్ తో కలసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు అంబలి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ప్రతి సంవత్సరం అంబలి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దేవర వినోద్ మాట్లాడుతూ వేసవి కాలం ముగిసే వరకు అంబలి పంపిణీ కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మోడెమ్ తిరు పతి గౌడ్, మాజీ సర్పంచ్ బొమ్మినేని అహ ల్య దేవి, మాజీ జడ్పీటీసీ వేముర్ల సంతోష్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, లావుడే రమేష్, దుర్గం దేవాజి, పెసరు మధునయ్య, కుందారపు శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.