calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబలి పంపిణీ అభినందనీయం

19-04-2025 08:02:18 PM

డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వేసవిలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు చేపడుతున్న అంబలి పంపిణీ అభినందనీయమని డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు(DCC President Kokkirala Vishwa Prasad Rao), మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉబేద్ బిన్ యాహియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం అంబలి పంపిణీ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే వారికి దాహర్తి తీర్చడం  సంతోషకరమన్నారు. యువత సమాజసేవలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు శంకర్, భీమ్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాసాదే చరణ్ నాయకులు బస్వన్, జమీర్, సాయి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.