calender_icon.png 26 December, 2024 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాస్తుల విచారణ బూటకం

26-12-2024 04:14:03 AM

బంగ్లా మాజీ ప్రధాని హసీనా తనయుడు

ఢాకా, డిసెంబర్ 25: అల్లర్లతో పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతో న్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూప్‌పూర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ లో హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్ డాలర్లు దోచుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో ఆమె కొడుకు సాజీబ్ వాజెద్ స్పందించారు. అక్రమాస్తుల విచారణ పూర్తిగా బూటకమని, దుష్ప్రచారం తప్ప మరొకటి లేదన్నారు.

అసలంత డబ్బు తామెప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. రష్యా ప్రభు త్వ సంస్థ రోసతో మ్ రూపొందించిన రూప్‌పూర్ అణువిద్యుత్ కేం ద్ర నిర్మాణంలో భారత్‌కు చెందిన సంస్థలకు భాగస్వామ్యం ఉంది. రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్ల నిర్మాణంలో ఉన్న ఈ పవర్ ప్లాంట్ ఆ దేశంలోనే తొలి అణు విద్యుత్ కేంద్రం. రూప్‌పూర్ అణువిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి షేక్ హసీనా, ఆమె కుమారు డు, సమీప బంధువులు 5 బిలియన్ డాల ర్లు మలేసియాలోని ఒక బ్యాంకుకు తరలించారని అభియోగం. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అవినీతి నిరోధక కమిషన్‌ను ఇటీవల బంగ్లాదేశ్ హైకోర్టు ప్రశ్నించింది.