calender_icon.png 20 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

03-07-2024 12:25:02 AM

  • ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, జూలై 2: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను కోరారు. ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ గణపతిరెడ్డితో మంగళవారం సమావేశమైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. రహదారి విస్తరణ పనులకు సంబంధించి అధికారులకు మూడు ప్రతిపాదనలు చేశారు. పనామా చౌరస్తాలో మట్టితో అండర్ బ్రిడ్జి నిర్మిస్తే రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలనీలకు కనెక్టివిటీ తెగిపోతుందని, వ్యాపారాలు కొనసాగలేని పరిస్థితి నెలకొంటుందని అన్నారు. మట్టితో ఫ్లు ఓవర్ నిర్మాణాన్ని విరమించుకోవాలని కోరారు.

అలాగే హయత్‌నగర్ రేడియో స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న 69 కుటుంబాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పనామా చౌరస్తాలో చేపట్టిన పనుల కారణంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని, విగ్రహాన్ని అక్కడే ఉంచి ఎన్టీఆర్ చౌరస్తాగా పేరు మార్చాలని మూడో ప్రతిపాదన చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సాగర్ రెడ్డి ఉన్నారు.