22-03-2025 12:38:22 AM
కొత్తపల్లి, మార్చి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన పల్లి మండలం కోరం గ్రామానికి చెందిన వృద్ధురాలు సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్ కు ప్రయాణిస్తూ అదృశ్యం అయినది ఎత్తు 05 అడుగుల 04 అంగుళాలు, నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి ఉంటుంది. గులాబీ రంగు చీర నీలం రంగు జాకెట్ ధరించి బస్సులో ప్రయాణిస్తూ అదృశ్యం అయినది.
ఆమె కోసం ఆమె బంధువులు, పోలీసులు ప్రతిచోట ఆమె ఆచూకీ కోసం ఆరా తీస్తూ గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ లభించినట్లయితే కొత్త పల్లి పోలీస్ స్టేషన్ కు సంబం ధించిన ఫోన్ నంబర్లు 9494490268 లేదా 8712670765 లకు సమాచారం అందించగలరని, సమాచారం అందించిన వారికి నగదు పారితోషణం ఇవ్వబడునని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారిని వసుంధర యాదవ్ ప్రకటనలో తెలిపారు.