19-04-2025 12:40:47 AM
మునిపల్లి ఏప్రిల్ 18 : తాను చనిపోతున్నానని చెప్పి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి స్విచ్చ్ ఆఫ్ చేసి ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన తుడుం నరేష్(22) అనే యువకుడు శుక్రవారం తన ఫ్రెండ్ అయి న సుదర్శన్ కు ఫోన్ చేసి నేను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
ఈ విషయం నరేష్ కుటుంబ సభ్యులకు తెలియడంతో మునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నరేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడు అదృశ్యనమైట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ నాయక్‌తెలిపారు.