24-03-2025 01:34:00 AM
మిర్యాలగూడ, మార్చి 23: మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఐలాపురం గ్రామానికి చెందిన బానోతు రాజేశ్ (21) ఈ నెల 15న ఇంట్లో మైసమ్మకుంట తండాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు నాటి నుంచి బంధువుల ఇండ్లు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.
దీంతో రాజేశ్ తండ్రి బానోతు శ్రీను ఈ నెల 18న మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు రాలేదు. రాజేశ్ ఆచూకీ తెలిసినవారు మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ లోకేశ్ కోరారు.