calender_icon.png 1 April, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

29-03-2025 08:03:24 PM

ఎమ్మెల్యే హరీష్ బాబు..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆలింకో ఆధ్వర్యంలో భారత్ డైనమిక్ లిమిటెడ్ వారి సహకారంతో దివ్యంగులకు ట్రై సైకిళ్ళు, కృత్రిమ కాళ్ళు, చేతులు, వినికిడి పరికరాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ.. ఆలింకో ఆధ్వర్యంలో 100 మందికి పైగా దివ్యంగులకు చేయూత నందించించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దివ్యంగులకు సమాజం బాసటగా నిలవాలన్నారు. దివ్యంగులు సైతం ఆత్మస్థైర్యం కోల్పోకుండా సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దివ్యంగులకు ఎటువంటి అవసరం  వచ్చినా సహాయం చేయడానికి తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలింకో, నేషనల్ డైనమిక్ లిమిటెడ్ సభ్యులు, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.