calender_icon.png 15 March, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథతో దర్శకులు సిద్ధం.. డేట్స్ ఇస్తుందా?

14-03-2025 12:00:00 AM

ఇండస్ట్రీలో సమ్ థింగ్ స్పెషల్ అంటే గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ గ్లామర్ జోలికి వెళ్లకుండా అద్భుతంగా నటించే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అమ్మడు సినిమా విడుదలైందంటే.. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె కోసం థియేటర్‌కు వెళ్లేవారు చాలా ఎక్కువ.

ఇటీవలి కాలంలో ‘అమరన్’తో పాటు ‘తండేల్’ హిట్ కొట్టింది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ బిజీ అయిపోయింది. ఒకవైపు టాప్ హీరోయిన్స్ అంతా కమర్షియల్ చిత్రాలకుసై అంటుంటే ఈ ముద్దుగుమ్మ మాత్రం గ్లామర్‌కు దూరంగా.. పెర్ఫార్మెన్స్‌కు దగ్గరగా ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ జోలికే వెళ్లదు.

ఈ ముద్దుగుమ్మను దృష్టిలో పెట్టుకునే దర్శకనిర్మాతలు కథలను సిద్ధం చేసుకుని డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ‘తండేల్’ తర్వాత సాయి పల్లవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. బాలీవుడ్ చిత్రాలను పూర్తి చేసుకుని ఇవ్వొచ్చని కొందరు అంటున్నారు. అభిమానులు ఆమె తదుపరి సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటిస్తుందో..