calender_icon.png 25 March, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్వానంగా మారిన కూరగాయల మార్కెట్ భవనం

23-03-2025 06:02:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనం అధ్వానంగా మారి దుర్వాసన తలెత్తుతుందని కూరగాయల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ లోపలి భాగంలో వర్షపు నీరు చేరి బురదమయంగా మారిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతున్న మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ భవనంలోపట నిర్మించిన కూరగాయలు అమ్ముకునే గద్దెలు చిన్నగా ఉండడంతో కూరగాయలు పెట్టుకోలేకపోతున్నామని, కింద కూర్చుని అమ్ముకుంటూ అవస్థలు పడుతున్నామని వ్యాపారులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కనీసం కరెంటు కూడా ఉండడం లేదని, పేరుకుపోయిన చెత్త వ్యర్ధాలను శుభ్రం చేయించడం లేదని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సిబ్బందితో మార్కెట్ భవనాన్ని శుభ్రం చేయించాలని వారు కోరుతున్నారు.