డిజిటల్ విప్లవం మన జీవితాలను మార్చేస్తోంది. సాంకేతికత, ఇంటర్నెట్, మొబైల్ పరికరాల వినియోగం పెరగడంతో డిజిటలైజేషన్ మనిషి జీవన శైలిని ప్రభావితం చేస్తోంది. సుస్థిర అభివృద్ధికి ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ), బిగ్ డే టా, బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతలు విద్య, వ్యాపారం, పర్యావరణ పరిరక్షణలో పెద్ద మార్పులు తీసుకు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత దేశం అమెరికా, చైనా తర్వాత మూడవ అతిపెద్ద డిజిటలైజ్డ్ దేశంగా ఉంది.‘ డిజిటల్ ఇండియా’ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా మార్చుతోంది.
సమాజాన్ని, వ్యాపారాలను, ప్రభుత్వ సేవలను కొత్త సాంకేతికతలతో నింపుతూ ఉత్ప త్తి, నాణ్యత, సౌలభ్యాన్ని పెంచుతోంది. ఇది అనేక రంగాల్లో ము ఖ్యమైన పరివర్తనలు తేవడామే కాకుండా కొత్త అవకాశాలను సృ ష్టిస్తోంది. యూపీఐ, డిజిటల్ పేమెంట్లు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెం దుతోంది. అయితే కనెక్టివిటీ పెరిగినా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ వ్యత్యాసం, సైబర్ సెక్యూరిటీ సవాళ్లు ఉన్నాయి.
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ. హైదరాబాద్