31-03-2025 10:35:33 PM
నందివాడలో బేడ బుడగ జంగం బోర్డ్ ఆవిష్కరణ..
బేడ బుడగ జంగం గౌరవ అధ్యక్షులు విభూది సాయిలు..
కామారెడ్డి (విజయక్రాంతి): బేడ బుడగ జంగం సంఘం ప్రతినిధులు ఐకమత్యంతో ఉండాలని బేడ బుడగ జంగం జిల్లా గౌరవ అధ్యక్షుడు వీబుది సాయిలు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బేడ బుడగ జంగం బోర్డు ఆవిష్కరణ ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు విభూది సాయిలు, ప్రధాన సలహాదారులు సిరిగిరి తిరుపతి, జిల్లా అధ్యక్షులు కొండపల్లి సాయిలు, ప్రధాన కార్యదర్శి సంకు పోచయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకట్, 57 ఉపకులాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పస్తం పరుశురాం, కోశాధికారి పొన్నకంటి నారాయణ, పొన్నకంటి రాజు, కోదండ సుమన్, కోదండ క్రాంతి, టేకి హనుమంతు, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు డేవిడ్, బేడ బుడగ జంగం కులస్తులు పాల్గొని కులం బోర్డు ఆవిష్కరించారు.