28-04-2025 12:55:50 AM
అమావాస్యతో శ్రీరాముడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
కోయిల్ కొండ ఏప్రిల్ 27 : కోయిలకొండ మండలం పరిధిలో కొలువుతీరిన శ్రీరామ కొండకు భక్తులు ఆదివారం అమావాస్య కావడంతో పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీరాముడు దర్శనం కోసం భక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేలాదిమంది కుటుంబ సభ్యులతో కొండపైకి ఎక్కి శ్రీరాముడిని దర్శించుకున్నారు.
భక్తులతో పాటుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శ్రీరాముడిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు వస్తారని సమాచారం ముందస్తుగా ఆలయ కమిటీ సభ్యులకు ఉండడంతో అధికారులు వేసవి తాపాన్ని తట్టుకునేలా నీడ ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు కొంత మేరకు ఉపశమనం కలిగింది.
ఆదివారం అమావాస్య రావడంతో కోయిలకొండ మండల పరిధిలోని శ్రీరామ కొండకు భక్తులు విచ్చేసి కొండపై ఉన్న ఆకులు తీసుకుని ఇంట్లో ఉంచుకుంటే మంచిదని నానాటి నుంచి భక్తులు విశ్వసిస్తుంటారు. దీంతో ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలు భక్తులు శ్రీరామ కొండకు వేలాదిగా తరలివచ్చడం ఆచారంగా మారింది. కొండపై కొలువుతీరిన శ్రీరాముడిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.