calender_icon.png 8 January, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి లోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలి...

07-01-2025 08:14:49 PM

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పై సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష...

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నూతనంగా మంజూరు చేసిన పనులను చేపట్టి మార్చి లోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Collector Koya Sri Harsha) అన్నారు. మంగళవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, పాఠశాలల మరమ్మతు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల, హస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులకు సంబంధించి టెండర్ చేపట్టి జనవరి 20 లోపు పనులు ప్రారంభించాలని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ మార్చి లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.