20-03-2025 05:40:41 PM
కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్...
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలో అణగారిన వర్గాల సంపూర్ణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం హర్షనియమన్నారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంతో పాటు రిజర్వేషన్ల పెంపకం కృషి చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.