బీజేపీ ఓబీసీ నేత సురేశ్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా సభ్యుడు పెరిక సురేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది జాతీయవాద పార్టీ విజయమని, ‘మహా’ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి, యూపీలో యోగి సారథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఘన విజయమన్నారు. మోదీ నాయకత్వంలోని అభివృద్ధి, సుపరిపాలనే ఈ ఎన్నికల్లో విజయం అందించాయన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అక్కడి ప్రజలు నమ్మలేదని స్పష్టం చేశారు.