calender_icon.png 7 January, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతల నిర్బంధం సరికాదు

06-01-2025 01:27:41 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): రైతు భరోసా పేరిట కాంగ్రెస్ చేసిన మోసంపై వరంగల్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కలిసేందుకు బీఆర్‌ఎస్ నేతల ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హనుమకొండ బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి , ఇతర నాయకులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖం డిచారు.

ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన మీ తీరును చూసి యావత్ తెలంగాణ రైతాంగం చీదిరించుకుంటోందన్నారు. ఎక్కడ రైతులు తిరగబడతారోనని, మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్లు తప్పించుకుంటారని ప్రశ్నించారు.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను ఎండగడుతూ ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు ఇతర బీఆర్‌ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.