calender_icon.png 6 November, 2024 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి సర్వేలో తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి

06-11-2024 02:57:01 PM

వనపర్తి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మదనాపురం మండల పరిధిలోని బాలకిష్టాపూర్, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, అమరచింత మున్సిపాలిటీ లోని 8 వ వార్డుల్లో సర్వే జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. స్వయంగా సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి బ్లాక్ లో సర్వే మొదలు పెట్టాలని, సర్వే గురించి గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలన్నారు.  ఎన్యూమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ స్టికర్లు వేయాలని సూచించారు. సర్వేలో భాగంగా ఇళ్లకు వేస్తున్న నంబర్లను సరిగా వేయాలన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని కలెక్టర్ ప్రశ్నించగా, 31 బ్లాక్స్ ఉన్నాయని, వాటిలో 26 బ్లాక్స్ కి టీచర్లు ఎన్యూమరేటర్లుగా ఉన్నారని మున్సిపల్ కమీషనర్ బదులిచ్చారు. టీచర్లను పాఠశాల సమయం అయిపోయిన తర్వాతే సర్వేలో పాల్గొనాలని సూచించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి, తహసీల్దార్ చాంద్ పాషా, మునిసిపల్ కమిషనర్లు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.