calender_icon.png 24 November, 2024 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే వివరాలు పకడ్బందీగా పొందుపరచాలి

07-10-2024 05:10:30 PM

కరీంనగర్, (విజయక్రాంతి): జిల్లాలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేలో సేకరించిన వివరాలు పకడ్బందీగా పోర్టల్ లో పొందుపరచాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి గ్రామాలు, వార్డుల్లో పూర్తిచేసిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్ రూరల్ మండలంలోని తాహెర్ కొండాపూర్, కొత్తపల్లి మున్సిపాలిటీలోని 12వ వార్డు,  చొప్పదండి నియోజకవర్గం లోని సాంబయ్య పల్లి, చొప్పదండి మున్సిపాలిటీ లోని ఏడో వార్డు,  మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ మండలం నెదునూరు, శంకరపట్నం మండలం ఆర్కండ్ల గ్రామం,  హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం పాపయ్యపల్లి, హుజురాబాద్ లోని 12వ వార్డులో ఇటీవల సర్వే పూర్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. డేట్ అఫ్ బర్త్, రిలేషన్ విత్ హెచ్ఓ ఎఫ్, ఆధార్ వివరాలను తప్పులు లేకుండా పొందుపరచాలన్నారు. ఎడిట్ ఆప్షన్ ఉండదని అన్ని వివరాలు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవోలు ఎంపీ ఓలు ఇతరులు పాల్గొన్నారు.