05-04-2025 12:44:49 AM
బియాండ్ యువర్ మైండ్స్ వ్యవస్థాపకరాలు సరోజ గుల్లపల్లి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) : లక్ష్యం ఏదైనా శ్రమిస్తేనే అది మీ సొంతం అవుతుందని బియాండ్ యువర్ మైండ్స్ వ్యవస్థాపకరాలు సరోజ గుల్లపల్లి అన్నారు శుక్రవారం పాలమూరు యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం విద్యార్థులకు రిచర్డ్ బాక్ రచించిన నవల లో జోనాథన్ లివింగస్టన్ సిగల్ అనే అంశం ఫై సరోజ గుల్లపల్లి (బియాండ్ యువర్ మైండ్స్ - వ్యవస్థాపకరాలు, మెలబోర్న్, ఆస్ట్రేలియా) ఆన్లైన్ లో అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా సీ గల్ పక్షి జాతిని ఆదర్శం గా తీసుకోవాలని, సీ గల్ పక్షులలో సోమరితనం ఉంటుందని, మందకు వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ, స్వేచ్చ గా ఎగరడం పట్ల తనకున్న మక్కువను అవిశ్రాంతంగా కొనసాగించడం ద్వారా నిజమైన స్ఫూర్తిని పొందవచన్నారు.
ఒత్తిళ్లు, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా, అభిరుచి కి అనుగుణంగా లక్ష్యం సాధించాలని, పనులను చేసే విధానాన్ని సవాలు చేయడమే అయినప్పటికీ, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై, శ్రేష్ఠతను అనుసరించాలని గుర్తు చేశారు.
చెయ్యాలని సంకల్పం చేరుకోవాలని పట్టుదల ఉంటే మీరు కచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటారని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం లో విభాగాధిపతి డా రవికుమార్, అధ్యాపకులు డా సిద్దరామ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.