- అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నేతల డిమాండ్
- నీట్, మణిపూర్, రైల్వే భద్రత అంశాలపై చర్చించాలని పట్టు
- ప్రత్యేక హోదా కోసం వైసీపీ, జేడీయూ వినతి
న్యూఢిల్లీ, జూలై 21: లోక్‌సభలో విపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని అఖిలపక్ష భేటీలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారం భం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష భేటీని పార్లమెంటరీ వ్యవరాహాల శాఖ నిర్వహించింది.
ఆదివారం పార్లమెంట్ అనెక్స్ హౌస్ లోని మెయిన్ కమిటీ గదిలో జరిగిన ఈ సమావేశంలో ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొనగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత వహించారు. పార్లమెం ట్ సమావేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, పేపర్ లీక్, చైనాతో భద్రత అంశాలు, పార్లమెంట్‌లో విగ్రహాల తొలగింపు, రైతులు, కార్మికులు, మణిపూర్ హింస, రైలు ప్రమాదాలపై చర్చించాలని కోరుకుంటున్నట్లు విపక్ష నేతలు స్పష్టం చేశారు.
సమస్యలపై చర్చించాలి..
అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక డిమాండ్లను వినిపించింది. విపక్షాలకే డిప్యూటీ స్పీక ర్ పదవిని కేటాయించాలని డిమాండ్ చేసింది. నీట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీక్, మణిపూర్‌లో చెలరేగిన హింసపై సభలో చర్చకు అనుమతించాలని స్పష్టం చేసింది. యూపీలోని కన్వర్ యాత్రలో దు కాణాలకు నేమ్ ప్లేట్లను తప్పనిసరి చేసిన అంశంపైనా చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేయగా అధికార టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు సైతం స్పెషల్ స్టేటస్ కావాలని బీజేపీ మిత్రపక్షం జేడీయూ కోరింది. కాగా,పశ్చిమబెంగాల్‌లో అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారు.
సభ సజావుగా సాగాలి
ఈ భేటీలో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు.. సభ సజావు గా సాగేలా ఉభయ సభల్లోని అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. భేటీ అనంతరం మాట్లాడుతూ.. 44 పార్టీల నుంచి 55 మంది నేతలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి విషయంలోనైనా చర్చకు ప్రభు త్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గత సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డగించారని, ఈ సమావేశాల్లో అలాంటి తప్పిదాలు చేయొద్దని పార్టీలకు రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. ఈ సమావేశాల్లో నీట్ పేపర్ లీక్, రైల్వే భద్రతా అంశాలనే ప్రధానాస్త్రంగా చేసుకోనున్నట్లు సమాచారం.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ, జూలై 21: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమ య్యే సెషన్‌లో 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ముం దుగా సోమవారం ఆర్థిక సర్వేను సభ్యుల ముందుచనున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మ లా సీతారామన్.. మరుసటి రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశా ల్లో ఆరు బిల్లులు సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు.. రైల్వే భద్రత, నీట్ పేపర్ లీకేజీపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కార్ వాటాను తగ్గించేందుకు జరిగే ప్రయాత్నాలపైనా సభలో చర్చలు జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వ హించేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ కార్యాలయం నుంచి ఓ బులెటిన్ విడుదైంది. సభను అగౌరవ పరిచే విధంగా ఎలాంటి నినాదాలను సభ్యులు చేయరాదని అందులో పేర్కొన్నారు.