13-04-2025 01:50:09 AM
*మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
*నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రైతు మహోత్సవం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తక్కువ ఖర్చుతో తయారు చేసిన యంత్రాలను, పనిముట్లను ప్రదర్శించడం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అగ్రిహార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతు మహోత్సవానికి ఆయన హాజరయ్యారు.
ప్రదర్శనశాలలను తిలకించి, రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనార్థం ఏ ర్పాటుచేసిన ప్రదర్శనశాలలు, వ్యవసాయరంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారుచేసే అనుబంధ ఉత్పత్తులు, గ్రామాల్లో ఉండే గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ చేయడం అభినందనీయమన్నారు.
ఇలాంటి ప్రదర్శనలు జి ల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి వ్యవసాయశాఖ నిశ్చయించిందని తెలిపారు. వాటి లో భాగంవావాలని అగ్రిహర్టి సొసైటీ ప్రతినిధులను కోరారు. ఈ ప్రదర్శనశాలలో అమృతం మామిడిపండును ఐస్‌క్రీంగా వాడటం, కుంకుడుకాయ తో అన్ని రకాల ఉత్పత్తులు చేయడం ప్రదర్శించారు. మంత్రివెంట చైర్మన్ సుధాకర్ రావు, కార్యదర్శి డా.వి.రావు, కోశాధికారి శ్రీరంగారావు ఉన్నారు.