calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెకే ఓసీ నిర్వాసితులకు ఇచ్చిన సింగరేణి క్వార్టర్స్ కూల్చివేతను నిలిపివేయాలి

19-04-2025 12:55:54 AM

నివాసం ఉంటున్నా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి 

సెలవు రోజున పోలీస్‌లను పంపడం సరికాదు: సీపీఎం

ఇల్లెందు, (విజయక్రాంతి):ఇల్లెందు పట్టణంలో జెకే ఓసి నిర్వాసితులకు ఇచ్చిన సింగరేణి క్వార్టర్స్ కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం నాయకులూ డిమాండ్ చేశారు. శుక్రవారం సెలవ రోజైన పోలీసుల అండదండలతో క్వార్టర్స్ లో బలవంతంగా కాలేజ్ చేయించడానికి వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబీలు మాట్లాడుతూ జేకే ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా ప్యాకేజీ పూర్తి స్థాయిలో పొందని వారికి, ఇంటి స్థలం, ఇళ్ళు ఇవ్వని వారికి, కొంత మందికి ఆర్ అండ్ ఆర్  ప్యాకేజీ లో అప్పటి ఆర్డీవో ఇంటి స్థలం పట్టాని ఇచ్చి స్థలం చూపించని వారికీ  సింగరేణి యాజమాన్యం నిర్వాసితులలో కొంత మందికి జేకే క్వార్టర్స్ ను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వారికి అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా క్వార్టర్స్ ను ఖాళీ చేయించాలని సెలవు రోజున పోలీస్ లను పంపించి బలవంతంగా ఖాళీ చేయించి కూల్చాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. జెకే నిర్వాసితులకు ఇచ్చిన క్వార్టర్స్ కూల్చివేతను నిరసిస్తూ సిపిఎం పా ర్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

సింగరేణి అధికారులు అందుబాటులో లేని కారణంగా ప్రస్తుతం కూల్చివేతలను నిలిపివేయాలని వారు కోరారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతు ఓసి విస్తరణలో నష్టపోయిన వారికీ ఎటువంటి ఆధారం చూపించకుండా ఇచ్చిన క్వార్టర్స్ నుండి బలవంతంగా పంపించి వేసి చేతులు దులుపొకోవాలని సింగరేణి అధికారులు చూస్తున్నారన్నారు. ఆనాటి ఆర్డీఓనే స్వయం గా ఇచ్చిన స్థలలు కేటాయించిన పట్టాలను చెల్లవని, ఇవి తాము ఇచ్చిన పట్టాలు కావని, నకిలీ పట్టాలు అని అధికారులు అనడం హాస్యాస్పదమన్నారు.

పట్టాలు ఇచ్చిన అధికారులే నకిలీ పట్టాలు అనడం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. నిర్వసితుల్లో కొద్దీ మంది మాత్రమే ఉన్నారనే ఆలోచనతో అధికారులు పట్టించుకోకుండా భయపెట్టి, బెదిరించి బయటకు పంపాలని చూస్తున్నారని, వారి పక్షాన  సిపిఎం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే ఖాళీ చేయించాలని,లేని పక్షం లో ఉద్యమలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సింగరేణి జీఎం కార్యాలయ ముట్టడికి తరలిరండి

జేకే ఓసి నిర్వాసితులకు ఇచ్చిన క్వార్టర్స్ కూల్చి వేతను నిరసిస్తూ శనివారం ఇల్లందు సింగరేణి జి.యం ఆఫీస్ ముట్టడికి నిర్వసితులు అందరు తరలి రావాలని సిపిఎం ఇ ల్లందు మండల కమిటీ కార్యదర్శి ఆలేటి కిరణ్ పిలుపునిచ్చారు. అధికారులు ఇచ్చిన పట్టాలు నకిలీవా, ఒరిజినలా అధికారులే తెల్చాలని ప్రత్యామ్నాయం చూపిన తరువాతే ఎటువంటి చర్యలు అయినా తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేష్, జేకే ఓసి నిర్వసితులు పాల్గొన్నారు.