calender_icon.png 31 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేత బాధించింది

01-09-2024 01:21:07 AM

సోదరుడి భవనం కూల్చివేతపై కాంగ్రెస్ నేత పల్లం రాజు

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): దుర్గం చెరువు పరిధిలోని తన సోదరుడు పల్లం ఆనంద్ స్పోర్ట్స్ వెంచర్‌ను కూల్చివేయడం బాధాకరమని ఏఐసీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చి వేయడం తనను బాధించిందని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజా జీవితంలో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్న తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధ గా ఉందన్నారు. ఏడెకరాల భూమి లీజుకు తీసుకొని తన సోదరుడు ఆనంద్ స్పోర్ట్స్ వెంచర్ (ఆర్‌వోఆర్)ను ఏర్పాటు చేశారని, ఇందుకోసం తీసుకున్న అనుమతులను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ కష్టపడి సంపాదించిన డబ్బులతో దీన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

ఆకట్టుకుంటున్న గ్రాండ్ నర్సరీ మేళా

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): నాలుగు రోజుల క్రితం నెక్లెస్ రోడ్  పీపు ల్స్ ప్లాజాలో ప్రారంభమైన ఆలిండియా హార్టిక ల్చర్, అగ్రికల్చర్‌షో నగర ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. శనివారం భారీ వర్షం పడుతున్నా ప్రకృతి ప్రియులు నర్సరీ మేళాకు వచ్చి మొక్కలు తీసుకువెళ్లా రు.  ప్రదర్శనలో వర్టిక ల్ గార్డెనింగ్, హైడ్రో ఫోనిక్ సిస్టమ్, టెర్రస్ గార్డెనింగ్  వంటి టెక్నాలజీలు ప్రత్యేకంగా నిలిచాయి.