calender_icon.png 26 December, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

10-07-2024 05:06:36 AM

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): నిరుద్యోగుల న్యాయమైన డిమాం డ్లను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సో మాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయ న బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, ప్రజాసంఘాల నాయకులతో కలి సి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల పరిష్కా రం కోసం ఈ నెల  15న నిర్వహించనున్న ‘చ లో సెక్రటేరియట్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడు తూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్ క్రాస్‌రోడ్‌లో నిరుద్యోగులతో మాట్లాడారని, అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు బత్తుల సిద్ధేశ్వర్లు, రమణకు మార్, మేకల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.