calender_icon.png 19 January, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

07-07-2024 01:48:45 AM

గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల సంఖ్య పెంచాలి..

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): నిరుద్యోగులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలు జరిపి, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని సర్కార్ అణగదొక్కాలనుకోవడం సరికాద ని హితవు పలికారు. న్యాయమైన డిమాం డ్లు కాకపోతే వేలాది మంది నిరుద్యోగులు రోడ్డె క్కి ఎందుకు ఉద్యమంలో పాల్గొంటున్నారని ప్రశ్నించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రజా సంఘానికి ఉంటుందని సీఎం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గ్రూప్ 1లో ప్రస్తుతం సర్కార్ 503 పోస్టులు మాత్ర మే చూపుతున్నదని, వాస్తవానికి 1,600 పోస్టుల వరకు పెంచే అవకాశం ఉందని, గ్రూప్ 783 పో స్టులు ప్రకటించారని, వాస్తవానికి 2 వేలకు పెంచవచ్చని, గ్రూప్ 3లో 1,383 పోస్టులు ప్రకటించారని, వాటి ని 3 వేల పోస్టులకు పెంచవచ్చని, గ్రూప్ 4లో 8,500 పోస్టులు ప్రకటించారని, వాటిని 12 వేలకు పైగా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను 11 వేల నుంచి 25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీ య కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, అంజి, మల్లే ష్ యాదవ్, రామకృష్ణ, రేగుల మధుసూదన్ రావు, అనంతయ్య, రాజేందర్, సతీష్‌కు మార్, బలరాం, హేమంత్ పాల్గొన్నారు.