calender_icon.png 27 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల డిమాండ్లు పరిష్కరించాలి

27-11-2024 01:35:48 AM

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ముషీరాబాద్, నవంబర్ 26 : దివ్యాంగుల న్యాయమైన డిమాం డ్లను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొని మాట్లాడారు.

దివ్యాంగుల పెన్షన్లను పెంచాలని, బ్యాక్‌లాక్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ రంగాలలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాల న్నారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య, జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్.గోపాల్ రావు, అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, వైస్ చైర్మన్ అందె రాంబాబు, పెద్దపల్లి సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు భవానీ చౌదరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పంతంగి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.