బొగ్గు లారీలను నిలిపి నిరసన
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితలగని నుంచి నిత్యం వందలాది లారీలు తిరుగుతున్నాయని వాటి నుంచి వచ్చె దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని దాసుతండా గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలంలోని దాసుతండా గ్రామస్తులు బొగ్గు లారీలను నిలిపి ఆదివారం రాత్రి ఆందోళన దిగారు. ఈ సందర్భంగా దాసుతండా గ్రామస్తులు మాట్లాడుతూ.. టేకులపల్లి నుంచి కోయగూడెం ఓసీ వెళ్ళె దారిలో దాసుతండా, రేగులతండా మధ్య మరమ్మతులు చేపట్టి మధ్యలోనే నిలిపి వేశారని అన్నారు. దీనితో గ్రామస్తులు దుమ్ము ధుళితో అన్యారోగ్యం బారిన పడుతున్నామని ఆందోళనకు దిగారు.
దుమ్మ ధూళితో ఇబ్బందులతో బొగ్గు లారీలను ఆపిన ఆపకుండా అధికారులు, కొందరు కలిసి భయందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. నిత్యం బొగ్గు లారీలతో అవస్థలు పడుతున్నామని, ఇంట్లోకి దుమ్ము ఎగిసిపడుతుందని పట్టించుకునేవారే లేరని ఆవేధన వ్యక్తం చేశారు. ట్యాంకర్ మూడు పూటల నిళ్లను పిచాకారీ చేస్తున్నమని చెప్పి నాలుగు రోజుల ముచ్చటగా చేశారని వివరించారు. సింగరేణి సంస్థ రూ.కోట్లలో ఆదాయం ఉన్నా ఎటువంటి అభివృద్ధి పనులను చేయట్లేదని విమర్శించారు. బోగ్గు పెల్లలు పడుతున్నా, బొగ్గు లారీలు ఎటువంటి టార్పలిన్ లేకుండా, ఓవర్లోడ్తో వెళ్తున్న చర్యలు తీసుకోవాట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యను పరిష్కారించాలని నూతన రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు.