calender_icon.png 3 April, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది

27-03-2025 01:42:23 AM

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమై న విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విద్యుత్ పద్దులపై జరిగిన చర్చపై భట్టి మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నాటికే విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్ల పీక్‌కు చేరిందని, అయినా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.

2029-30 నాటికి 24, 215 మెగావాట్లు , 2034- 35 నాటికి 31,809 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడే అవకాశముందన్నారు. రాజస్థాన్‌లో విద్యుత్ శక్తి ఉత్పత్తికి సింగరేణి ఆధ్వర్యంలో సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతో ఎంవో యూ కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.