- కులగణనను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టాలి
- డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): బీసీ కులగణన కోసం ఏర్పాటు చేసి న డెడికేటెడ్ కమిషన్‌ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత కోరారు. బీసీ కులగణనపై బీసీ వర్గాల్లో ఉ న్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చే యాలన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లో రూపొందించిన సమగ్ర నివేదికను సో మవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బీ వెంకటేశ్వర రావుకు అందజేశారు.
ఈ సం దర్భం గా మాట్లాడుతూ 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణనను ఎందుకు చేప ట్టలేదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో చేపట్టిన కులగణ వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిం చారు. ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉందని తెలిపారు.
తె లంగాణలో కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. తాము కులగణన చేపట్టబోమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో 2021లో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక భావాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను యధాతథంగా అమలు చే యాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు కోర్టు లో కేసులు వేస్తే ఈ అంశం నిలబడుతుందా అన్న దానిపై బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వ ర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలన్న ఉద్యమాన్ని తాను గతంలోనే ప్రారంభించానని, భవిష్యత్తులోనూ ఉద్యమిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు.
కార్యక్రమంలో రామచంద్రం, శివశంకర్, రాజారాం యాదవ్, హరి, బీఆర్ ఎస్ సీనియర్ బీసీ నాయకులు ప్రకాశ్, రవీందర్‌సింగ్, గౌరీశంకర్, రవికుమార్‌గౌడ్, సుమిత్ర ఆనంద్, రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి, ఉపేంద్రచారి, కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, రామ్ బాబు యాదవ్, రూప్ సింగ్, రవీందర్ యాదవ్, మహేశ్ యాదవ్, నా రాయణ, నరహరి, వీరన్న, మారయ్య, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.