ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం
యాదాద్రి భువనగిరి జనవరి 30 (విజయక్రాంతి) ః తెలంగాణ రాష్ర్ట ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు సరైన కావని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం అభిప్రాయపడింది. ఇంటర్ బోర్డు నిర్ణయాలకు నిరసనగా అన్ని జిల్లాల్లో బోర్డు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించిన మేరకు గురువారం కళాశాల సంఘాధికార ప్రతినిధి సింగనబోయిన మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు..
ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ... ఇంటర్ బోర్డు 15 రోజుల పరీక్షల ముందు ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ముందస్తుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే స్వాగతిస్తామని అన్నారు.
ఇలా ముందస్తు కెమెరాల ఏర్పాటుతో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనై అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ స్పందించి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శి బత్తుల శంకర్, జాయింట్ సెక్రటరీ మదిర మల్లెశం, దరిపల్లి ప్రవీణ్,జంగయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్, మల్లేశం, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.