calender_icon.png 24 December, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాల నిర్ణయాలకు కోర్టుల్లో చుక్కెదురు

29-08-2024 12:00:00 AM

రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతిసం దర్భంలో హైకోర్టులు, సుప్రీంకోర్టు జో క్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని ప్రభుత్వాలను ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని ప్రశ్నించింది. మురళీధర్ రావు కమిషన్ సిఫారసు ప్రకారం బీసీ రిజర్వేషన్లను 25-నుంచి 44 శాతానికి ఎన్టీఆర్ పెంచిన ప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన పెంచారని 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రశ్నించింది. పెంచిన రిజర్వేషన్లను కొట్టివేసింది.

2010లో కృష్ణ మూర్తి వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసులో  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 50శాతం రిజర్వేషన్లను పెట్టినప్పుడు జనా భా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన అ మలు చేస్తారని సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. చివరకు రిజర్వేషన్లు చెల్లవని కొట్టివేసింది. జనాభా లెక్కల వివరాలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచవచ్చని తీర్పు చెప్పింది. ఇలా వందల కేసుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా దానికి చీమకుట్టినట్టు కూడా లేదు. రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ సిఫార్సుల ప్రకారం కులగణన చేయాలి. జనాభా లెక్కలు లేనందువల్ల రిజర్వేషన్ల శాతం ఎంత నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్ ఇబ్బంది పడుతున్నది.

ఎప్పుడో 1931లో బ్రిటీష్ ప్రభుత్వం జరిపిన కులా ల వారీ లెక్కలపై ఆధారపడి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయస్థాయిలో ఒకే రకంగా లేవు. అందుకే జనాభా గణనలో కుల గణన చేపట్టాలని 1953 లో కేంద్ర ప్రభుత్వం నియమించిన  కాకా కలేల్కర్ కమిషన్ జనాభా లెక్కల్లో కులాల వారీ లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది. అలాగే 1978లో కేంద్ర ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్‌కూడా జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసింది.

అన్ని కమిషన్లదీ అదే మాట 

ఏపీ ప్రభుత్వం నియమించిన అనంతరామన్ కమిషన్ (1968), వీరప్ప కమిటీ (1975), మురళీధర్ రావు కమిషన్‌తో పాటు వివిధ రాష్ట్రాలు నియమించిన కమిషన్లతో పాటు 1994 తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నియమించిన అన్ని బీసీ కమిషన్లుకూడా కులాలవారీ లెక్కలు తీయాలని సిఫార్సు చేసాయి. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కానీ బీసీల పట్ల వ్యతిరేక వైఖరితోనే కులాల వారి లెక్కలు తీయడానికి ముందుకు రావడం లేదు. 1981లో స్వర్గీయ ఎన్టీ రామారావు, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 44 శాతం పెంచితే జనాభా లెక్కలు లేవని హైకోర్టు కొట్టివేసింది.

అలాగే కర్ణాటక ప్రభుత్వం రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించి వెంకటస్వామి కమిషన్ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు తీసింది. అనేక రాష్ట్రాలు కులాల వారీగా జనాభా లెక్కలు తీశాయి. తెలంగాణలో సమగ్ర సర్వే పేరుతో లెక్కలు తీయగా బీసీ జనాభా 52శాతంగా తేలింది. అలాగే ఆంధ్ర,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా చేశాయి. కానీ, వీటికి చట్టబద్ధత లేదని కోర్టు అంగీకరించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిసారీ బీసీ జనాభా లెక్కలు తీస్తారు. ఒక్కొక్కసారి వివిధ రకాల అవసరాలకు తగ్గట్లుగా బీసీల జనాభా శాతం నిర్ణయిస్తున్నారు.  అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో బీసీ జనాభా లెక్కలు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలని సిఫార్సు చేస్తున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 1981లో స్వర్గీయ ఎన్టీ రామారావు, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 44 శాతం పెంచితే జనాభా లెక్కలు లేవని హైకోర్టు కొట్టివేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించి వెంకటస్వామి కమిషన్ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు తీసింది. అనేక రాష్ట్రాల్లో కులాల వారీగా జనాభా లెక్కలు తీశారు. తెలంగాణలో సమగ్ర సర్వే పేరుతో లెక్కలు తీశా రు. బీసీ జనాభా 52 శాతంగా తేలింది. అలాగే ఆంధ్ర,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తీశాయి. కానీ, వీటికి చట్టబద్ధత లేదని కోర్టు అంగీకరించడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిసారీ బీసీ జనాభా లెక్కలు తీస్తారు. ఇలా ప్రతి రాష్ర్టంలో  జనాభా లెక్కలు విడివిడిగా తీస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో బీసీ జనాభా లెక్కలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జనాభా గణనలో కులాల వారీ లెక్కలు తీయాలని తమిళనా డు ప్రభుత్వం 2006లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిం ది. అలాగే 2014లో ఏపీ అసెంబ్లీ కూడా కులాల వారీగా జనాభా లెక్కలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మహారాష్ర్ట ,బీహార్ అసెంబ్లీలతో పాటుగా దాదావు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా స్పందన లేదు.

అన్ని వర్గాలకూ లెక్కలున్నాయి

 స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేటాయింపు కోసం ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు వులులు, ఇతర జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కులాలవారీ లెక్కలు చేయడం వలన కులతత్వం పెరుగుతుందని పస లేని విమర్శలు చేస్తున్నారు. ఇది ఊహ మాత్రమే.

ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతున్నదా! అలాగే ఎస్సీ, ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యాలకు మాత్రమే కులాలవారీ లెక్కలు ఉపయోగపడుతున్నాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాలవారి లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఒక్కపైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనపరమైన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి.

రాజ్యాంగాన్ని సవరించి అమలు చేయాలి

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 15(4),16(4), 340 లో ఉన్న వెనుకబడిన తరగతులు అనే పదాన్ని తొలగించి వెనుకబడిన కులాలుగా మార్చి, ఆర్టికల్ 46 లో ‘సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్‌వర్డ్ క్యాస్’్ట అనే వాక్యాన్ని చేర్చి రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాలి. ప్రభుత్వరంగం లో వెనుకబ డిన కులాలకు కల్పించిన రిజర్వేషన్లు మరింత కట్టుదిట్టంగా అమలు చేసే సౌలభ్యం కలుగుతుంది.

జనాభా లెక్కల సేకరణతోపాటు బీసీ కులాల గణనను కూడా చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇకనైనా బీసీలు సంఘటితంగా పోరాటం చేయగలిగితే మన హక్కులను సాధించుకో గలుగుతాం. 78 సంవత్సరాలుగా మోసం చేస్తున్న పార్టీలకు బీసీలు వచ్చే స్థానిక సంసల్థ ఎన్నికల్లో తమ ఓటు ద్వారాగుణపాఠం తెలియజేస్తాయని ఆశిద్దాం.

వ్యాసకర్త తెలంగాణ 

లోక్‌సత్తా పార్టీ, రాష్ర్ట అధ్యక్షుడు