సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు
నాగర్ కర్నూల్, జనవరి 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు 15వెల నుండి 12వేలకు కుదిస్తూ క్యాబినెట్ తీసు కున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు డిమాండ్ చేశా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌర స్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదని ప్రస్తుతం రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తుండగా ఎన్నికలకు ముందు 15వేలు భరోసా ఇస్తామని ప్రకటించి 12 వేలకు కుదించ డం సరికాదన్నారు.
రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు మరింత పెరిగాయని చివరికి ఇతరుల మీదే ఆధార పడవలసి వస్తుందన్నారు. కార్యక్ర మంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు, దేశ్య నాయక్, ఆంజనేయులు, శ్రీనివాసులు, నరసిం హ, ఈశ్వర్, రామయ్య, మల్లేష్ శంకర్ నాయక్, శివవర్మ, అశోక్, నాగరాజు, దశరథం బాలస్వామి, తార సింగ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.