calender_icon.png 4 October, 2024 | 4:57 AM

అబార్షన్‌పై నిర్ణయం స్త్రీ వ్యక్తిగతం

04-10-2024 01:33:38 AM

డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా

న్యూయార్క్, అక్టోబర్ 3: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరిగిన డెబేట్‌లో అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ గర్భవిచ్ఛిత్తి అంశంపై వాడీవేడిగా వాదించారు. ఈ క్రమంలో ట్రంప్ సతీమణి మెలానియా నుంచి కీలక స్పందన వచ్చిం ది. అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్ వాదిస్తుండగా.. మెలానియా మాత్రం అబార్షన్ హక్కును సమర్థించారు.

అక్టోబర్ 8న ‘మెలానియా’ పేరుతో విడుదల కానున్న మెమోర్‌లో ఈ అంశంపై మెలానియా తన అభిప్రాయాన్ని పొందుపరిచారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘ఆమె శరీరం గురించి నిర్ణ యాలు తీసుకొనే హక్కు ఆమెకు కాకుండా ఇంకెవరికో ఎందుకు ఉం డాలి? అవాంఛిత గర్భానికి సంబంధించి ఒక మహిళ తీసుకొనే నిర్ణయాన్ని పరిమితం చేయడం..

ఆమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందికే వస్తుంది’ అని ఆమె రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెల జరిగిన డిబేట్‌లో కమల మాట్లాడుతూ.. ట్రంప్ అబార్షన్లపై నిషేధం విధించాలనుకుంటున్నారని చెప్పారు. ఆయన అధ్యక్షు డిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్లపై నిషేధంపై సంతకం చేస్తారన్నారు. దీనికి ట్రంప్ బదులిస్తూ గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను అనుకూలం కాదని, ఆలస్యంగా చేసే అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.