calender_icon.png 16 November, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీబీ చేతుల్లో నిర్ణయం

12-11-2024 12:00:00 AM

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

కరాచీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎదుట ఐసీసీ మరోసారి ప్రస్తావించింది. పాక్‌లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో హైబ్రీడ్ మోడ్‌ను ఒకసారి పరిశీ లించాలంటూ ఐసీసీ పీసీబీకి సోమవారం మెయిల్ పంపినట్లు సమాచారం.

దీంతో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భవితవ్యం పీసీబీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. టోర్నీలో టీమిండియా ఆడకుంటే భారీ నష్టం కలిగే చాన్స్ ఉంది. హైబ్రీడ్ పద్దతిలో భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లతో పాటు (ఒకవేళ సెమీస్, ఫైనల్ చేరితే) ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తే బాగుంటుందని ఐసీసీ తెలిపింది. 

అయితే బీసీసీఐ గత వారం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడడం కుదరదంటూ అంతర్జాతీయ క్రికెట్‌కు గతవారం లేఖ రాసింది. దీంతో టోర్నీ నిర్వహణపై సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.