ఆర్జీకర్ ఘటన కేసులో కలకత్తా హైకోర్టుకు సీబీఐ
కోల్‌కతా, జనవరి 22: ఆర్జీకర్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి మరణ శిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టును ఆశ్రయించడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంది. తీర్పును సవాలు చేసే అధికారం దర్యాప్తు చేసిన సంస్థకే ఉందని పేర్కొంది. అలాగే కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని హైకోర్టులో అప్పీలు చేసింది.