09-03-2025 04:32:33 PM
ఆయన మృతి ప్రజలకు తీరని లోటు..
కాంగ్రెస్ నాయకుడు దాసరి శివ..
మంథని (విజయక్రాంతి): పాముల భాస్కర్ ఇక లేడు... పాముల భాస్కర్ గా సుపరిచితుడైన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన (పోతరవేని) భాస్కర్ ఆదివారం మృతి చెందగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత దాసరి శివ సంతాపం వ్యక్తం చేశారు. బేగంపేట గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను విష సర్పాల బారి నుండి భాస్కర్ కాపాడుతూ, ప్రజలకు సేవ చేశాడని శివ గుర్తు చేశాడు. పాములను పట్టే నైపుణ్యాన్ని భాస్కర్ ఇతరులకు కూడా నేర్పించాడని, మృతుడి సేవలను కుటుంబ పరిస్థితిని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకుపోయి భాస్కర్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.