కుటుంబ సభ్యులకు పరామర్శలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని (విజయక్రాంతి): సింగరేణి ప్రమాదంలో కార్మికుడు సత్యనారాయణ మృతిచెందడం బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు ఆవేదనతో అన్నారు. మంగళవారం సాయంత్రం మృతి చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులను గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో కనీస వేతనాల సలాహా మండలి ఛైర్మెన్ జనక్ ప్రసాద్ తో కలిసి శ్రీను బాబు పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సుమారు 2 గంటలు గోదావరిఖని ఏరియా హాస్పిటల్ లో బాధిత కార్మికుని కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డారు. అక్కడున్న సింగరేణి సంబంధిత అధికారులతో మాట్లాడి కార్మిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని శ్రీను బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.