calender_icon.png 11 January, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మగ్లర్ల సావు తెలివితేటలు

12-07-2024 12:48:22 AM

కొత్త, కొత్త మార్గాల్లో బంగారం స్మగ్లింగ్

ఆశ్చర్యపోతున్న కస్టమ్స్ అధికారులు

ముంబై, జూలై 11: అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల ఇలా కాదేదీ కవితకు అనర్హం అన్నరీతిలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులే ఆశ్చర్యపోయేలా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరగడం తో స్మగ్లింగ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అత్యాశకు పోయి అనేక అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా బుక్కవుతున్నారు. జూలై 1 నుంచి 9 వరకు ముంబై కస్టమ్స్ అధికారులు విమానప్రయాణికుల వద్ద నుంచి 16 కిలోల బంగారం, అరకోటి విలువ చేసే ఇతర దేశాల కరెన్సీని పట్టుకున్నారు. 

10 రోజులు.. 22 కేసులు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జూలై 1 మ ధ్యలో మొత్తం 22 కేసులు నమోదు అయిన ట్లు అధికారులు తెలిపారు. దుబాయ్, మస్క ట్, షార్జా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద స్మగుల్డ్ గూడ్స్ దొరికాయి. 

నోరెళ్లబెడుతున్న అధికారులు.. 

స్మగ్లర్ల సావు తెలివితేటలు చూసి కస్టమ్స్ అధికారులే ఖంగు తింటున్నారు. ప్రయాణికు లు వారి ఇన్నర్స్, సామగ్రి, పేపర్ లేయర్ల మధ్య ఉంచి అధికారుల కళ్లు గప్పేందుకు ప్ర యత్నిస్తున్నారు. వ్యాక్స్, రాడ్స్‌లలో బంగారం తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. షార్జా నుంచి వచ్చిన ఓ విదేశీ యురాలి వద్ద 260 గ్రాముల గోల్డ్ చైన్ లెక్క లో లేని బంగారంగా తేలింది. ఇద్దరు ఇండియన్లు 48 లక్షల ఫారిన్ కరెన్సీని తీసుకెళ్తూ పట్టుబడ్డారు. గల్ఫ్ దేశాల్లో బం గారం చాలా చవకగా లభిస్తుంది. అందుకోసమే ఇలా స్మగుల్ చేస్తూ పట్టుబడుతున్నారు. 

వాటిని కూడా వదల్లేదు.. 

చివరికి కొంత మంది రీఫిల్స్, బాల్ పెన్స్, కళ్లద్దాల బాక్స్‌లు, బాడీలో బంగారంతో రాడ్స్ చేయించుకుని దొంగచాటున తరలిస్తూ పట్టుబడుతున్నారు. 

రైల్వే ప్రయాణికుడి వద్ద రూ.1.89 కోట్ల బంగారం

రైళ్లలో అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఆర్పీఎఫ్ బలగాలు ప్రత్యేకంగా చేపట్టిన‘ఆపరేషన్ సత్రక్’లో భాగంగా ఓ రైల్వే ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం, నగదు బయటపడింది. ఆర్పీఎఫ్ బలగాలు బుధవారం తిరుచిరపల్లి స్టేషన్ వద్ద చెన్నై ఎగ్మో ర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో తనిఖీలు నిర్వహించగా.. లక్ష్మణన్ అనే ప్రయాణికుడు బ్యాగులో రూ.1.89 కోట్ల విలువ చేసే బంగా రు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు బయటపడింది. నిందితుడు ఆ నగలను మధురైలో పంచేందుకు తీసుకెళ్తున్నట్లు తేలింది.