హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 7 వరకు రెండో విడుత అడ్మిషన్ల గడువును పొడిగిస్తూ ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. ఇదే చివరి అవకాశమని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని అధికారులు తెలిపారు. ఇంటర్లో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు టెన్త్ మార్కుల మెమో, ఆధార్ కార్డును దరఖాస్తుకు జతపరచాలని సూచించారు. ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, దాని ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.