calender_icon.png 27 January, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొట్లాడుకునే జమానా పోయింది

22-01-2025 01:06:22 AM

  • కలిసికట్టుగా పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం
  • మాజీ సర్పంచులు బిల్లుల కోసం అల్లాడుతున్నరు 
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

సిద్దిపేట, జనవరి 21 (విజయక్రాంతి): గతంలో మాదిరిగా కొట్లాడుకునే జమాన పోయిందని అందరం కలిసికట్టుగా అభి వృద్ధి చేసుకుందామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సర్పంచులు అభివృద్ధి చేసి బిల్లులు రాక అప్పుల పాలై, మాజీ సర్పం చులు అల్లాడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఫంక్షన్ హాలు, ప్రారంభోత్సవం కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మాజీ సర్పంచు లంతా పెండింగ్ బిల్లులు రాక అల్లాడుతు న్నారని, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆవేదనను అర్ధం చేసుకుని వెంటనే పెండింగ్ లో ఉన్న ఆ బిల్లులను చెల్లంచి వేలాది మంది సర్పంచులను ఆదుకోవాలని  కోరారు. జెండాలను, ఎజెండాలను, బేషజాలను పక్కనపెట్టి అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.

రాష్ట్రా అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలంది స్తోందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం సంతోషిదాయకమని ఈ కార్యక్రమానికి పిలిచి తనతో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభోత్సవం చేయడం మర్చిపోలేనిదన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలంగాణలో రూ .30 లక్షల మంది రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నమని తూలిపారు. రానున్న రోజుల్లో రైతులకు యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు చేస్తున్నామని అట్లాగే ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోడీదేనాని కొనియాడారు.

ఒక్కో యూరియా బస్తా మీద రూ. 2,236 లు సబ్సిడీ ఇస్తున్నామని రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎరువుల కొరత అనేది లేకుండా, చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసే పనిలేకుండా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. యూరియా బస్తాలు మోసే పనిలేకుండా నానో యూరియా ప్యాకేట్లను అందిస్తోందని తెలిపారు.