calender_icon.png 23 December, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డాకూలీల చీకటి బతుకులు

21-09-2024 12:00:00 AM

వేట్ రంగంలో,జీవన పోరాటంలో రోజువారీకూలీ చేసుకుని బతుకుతున్న కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33  జిల్లా కేంద్రాలలో ఉన్న అడ్డా కూలీల సంఖ్య, కూలీల వివరాలు,విద్యార్హతలు,గృహ వసతి వంటి అంశాలపై సర్వే నిర్వహించి లేబర్లుగా గుర్తిస్తూ వారికి లేబర్ కార్డులు ఇవ్వాలి. అడ్డా కూలీలు తమ నివాస ప్రాంతాల నుండి పనిచేసే ప్రాంతాలకు రేందుకు ఉపయోగిస్తున్న రవాణా విధానాలు, వసతి మున్నగు మౌలిక సౌకర్యాల లభ్యత అంశాల మీద సర్వే నిర్వహించాలి. అడ్డా కూలీలలో ఎక్కువశాతం భవన నిర్మాణ కార్మికులే ఉండడం గమనార్హం.

వీరిలో ఎక్కువశాతం  ఎస్సీ, ఎస్టీ,బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. చాలా మంది నిరక్షరాస్యులు.కార్మిక చట్టాల మీద  వీరికి అవగాహన వుండదు. ఒకే కాంట్రాక్టర్ కింద పనిచేసే కార్మికులు కొందరైతే, వ్యక్తిగతంగా పనిచేసే వారు కొందరు .కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కూలీలకు నెలల తరబడి పని లభిస్తుంది. వ్యక్తిగతంగా పనిచేసే కార్మికులకు పని లభించడం కష్టంగా ఉంటుంది. 

 ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్డు,ప్రమాద బీమా సౌకర్యం,హెల్త్ కార్డులు, లేబర్ కార్డులు మంజూరు చేయాలి. గ్రామాల నుండి మండల కేంద్రాలకు,జిల్లా కేంద్రాలకు బస్సులు,రైళ్లలో ప్రయాణించడానికి టిక్కెట్ల రేట్లలో 50 శాతం రాయితీ ఇవ్వాలి.అడ్డా కూలీలలో ఎక్కువగా భూమిలేని నిరుపేద కూలీలు. వారికి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3ఎకరాల పట్టా భూమి ఇవ్వాలి. గ్రామాలలో ఉద్యాన వనాలు,నర్సరీ పెంపకంలో ఉపాధి కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తే పట్టణాలకు వలస తగ్గుతుంది. 

 అడ్డాకూలీల సగటు వయసు 15 సంవత్సరాల నుండి 60  సంవత్సరాల వరకు  ఉంటుంది.ఒక భవనం నిర్మాణం పూర్తి అయ్యేవరకు  10 నుండి 20 మంది ఒకే ప్రాంతంలో ఒక భవనం వద్ద కాంట్రాక్టర్ నిర్మించిన గుడిసె,ఇరుకు గది,టెంట్లలో 5నుండి 10 మంది నివాసముంటారు. లేబర్ అడ్డాలో మౌలిక వసతులుఏర్పాటు చేయాలి. 60ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్,ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. అడ్డా కూలీల పిల్లల చదువుకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కల్పించి కేజీనుండి పీజీవరకు ఉచితహాస్టల్,విద్యకల్పించాలి.ఢిల్లీ,హర్యానా,కర్ణాటక,మహరాష్ట్ర,పంజాబ్ ప్రభుత్వాలు అడ్డా కూలీలకు మోటారు సైకిళ్లు పంపిణీ చేస్తున్న పద్ధతిని తెలంగాణ ప్రభుత్వం కూడాఅమలు చేయాలి. ఆర్థిక భద్రత భరోసాతో అడ్డా కూలీల జీవితాలలో వెలుగు నింపాలి. అడ్డాకూలీల  శ్రామిక సామర్థ్యాన్ని,నైపుణ్యాన్ని పెంచటానికి ప్రభుత్వం ప్రత్యేక వృద్ధి వ్యూహాలను అమలు చేసి వారిజీవితాలలో వెలుగులు తెస్తుందని ఆశిద్దాం.

 నేదునూరి కనకయ్య