- పట్టించుకోని విద్యుత్ అధికారులు
- తట్టిఅన్నారం జీవీఆర్ కాలనీలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు
అబ్దుల్లాపూర్మెట్, జనవరి 30: విద్యత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం పొంచి ఉంది. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ, తట్టి అన్నారం గ్రామం జీవీఆర్ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ టాన్స్ కో అధికా రులు కంచె ఏర్పాటు చేయకపోవ డంతో ప్రలు ప్రమాదాలు జరిగే అవకా శాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ ట్రాన్స్ ఫార్మర్కు అనుకుని ఓ కిరాణం ఉంది. ఈ చుట్టు ప్రక్కన ఈ ఒక్కటే కిరాణం షాపు ఉండడంతో ... ఎక్కువ మంది చిన్నారులు షాపుకు వస్తుంటారు. వచ్చి.. వెళ్లే సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే ఎవ్వరిదీ బాధ్యత అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఏండ్ల కొద్ది ఈ ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ఇలాగే వదిలేశారని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్ వద్ద దిమ్మెను తక్కువ లొతుతో నిర్మించారు. దీంతో ఆ ట్రాన్స్ఫార్మర్ వైర్లు కిందకి వేలాడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఇదే జీవీఆర్ కాలనీలో 11కేవీ విద్యుత్ వైర్ తెగిపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని జీవీఆర్ కాలనీ వాసులు కోరుతున్నారు.